పుట:2015.373190.Athma-Charitramu.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 166

నాగపూరులో జరిగినదేశీయమహాసభకుఁ బోయి వచ్చుచుండెడి కొందఱు మిత్రు లుండిరి. వీరిని రాజమంద్రి కొనిపోవుటకు పాపయ్యగారు మున్నగు స్నేహితులు వచ్చిరి. కాఁబట్టి పడవలోఁగూడ నాకు సుఖముగ నుండెను. 8 వ తేదీని రాజమంద్రి చేరితిని.

13 వ తేదీని సంక్రాంతినాఁడు రాజమంద్రి పురమందిరములో కీ. శే. బసవరాజు గవఱ్ఱాజుగారి ఛాయాపటము నెలకొల్పు సందర్భమున నొకబహిరంగసభ జరిగెను. కళాశాలాధ్యక్షులు మెట్కాపు దొరగారు ఆసభ కధ్యక్షులు.

చెన్నపురినుండి వచ్చినపిమ్మట, మద్రాసు బ్రాహ్మసమాజ పద్ధతులను జూచివచ్చినహేతువున, మతవ్యాపనమం దెక్కువ శ్రద్ధ వహించితిని. సమాజమునకు నూతన సభ్యులను జేర్చితిని. ఇన్నిసుపేటలో రెండవ ప్రార్థనసభ నేర్పఱిచితిమి. జనవరినుండియు సత్యసంవర్థనీవ్యవహారకర్తగఁ బని చేయుటకు సాంబశివరావు సమ్మతించుట చేత, ఆపని యాతని కొప్పగింపఁబడెను. తమ్ముఁడు నేనును జదువుకొనుట కొకగది పెద్దరస్తా సమీపమునఁ గుదిర్చితిమి. అది యిపుడు సమాజాభిమానులు తఱుచుగఁ గూడి సంస్కరణవిషయములు, పత్రికా వ్యవహారములును జర్చించుకొను రచ్చసావడి యయ్యెను. ఇంతలో విశ్వవిద్యాలయ పరీక్షాఫలితములు తెలిసెను. కొండయ్యశాస్త్రి ప్రవేశపరీక్షయందును, కనకరాజు గంగరాజులు ప్రథమశాస్త్ర పరీక్షయందును నుత్తీర్ణులైరి. పట్టపరీక్షకుఁ జదువుటకై గంగరాజు చెన్నపురికిఁ బోయెను. చదువు చాలించి యుద్యోగము చేయఁజూచిన కనకరాజు, మిత్రులమగు మా ప్రోత్సాహమున రాజమంద్రి కళాశాలలో పట్టపరీక్షతరగతిలోఁ జేరెను. ఇంతియ కాదు. నే నిదివఱకు మిత్రులతోఁ గలసి యాలోచించుచుండిన "ఆస్తికపాఠశాలా" స్థాపనవిష