పుట:2015.373190.Athma-Charitramu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తుల నొప్పెడి సంస్కారప్రియుఁడను!" పాఠకులు నా యౌవనము నాఁటి యహంభావమునకు వెఱ గంద కుందురు గాక !"

జననీజనకులతో గలిగిన సంఘర్షణము బందుమిత్రులతోను, సంఘముతోను సహజముగ గలిగినది. ముత్తుస్వామిశాస్త్రి విపరీతవిధానము, జనకుని విచిత్ర చిత్రవృత్తులు, మొదలగు ఘట్టములు విద్యారంగము నందు గలిగిన సంఘర్షణమునకు నిదర్శనములు. వేంకటశివుడుగారి దినచర్యలు వారినియమ జీవయాత్రకు నిదర్శనములు. వారి 20 వ ఏటను వ్రాసిన 1 - 1 - 1990 దినచర్యయం దిట్లు గలదు.

"1 - 1 - 90 : - 'సర్వసమర్థుఁడా ! నాశత్రువులనుండి నన్ను రక్షింప నీవే యోపుదువు గాని, కడు దుర్బలుఁడ నగునేను గాను సుమీ !' ........1. శరీరసాధకమును గూర్చి ముఖ్యముగ శ్రద్ధవహింపవలెను. 2. కోపము, గర్వము, అసూయ, లోభము - వీని నదుపులో నుంచవలెను. 3. ప్రేమ, మతోత్సాహము మున్నగువానిపట్ల మితి మీఱరాదు. 4. నిరర్థకవిషయములనుగుఱించి కాలము వ్యర్ధపుచ్ఛఁగూడదు. 5. ఏపరిస్థితులందును పరనింద చేయరాదు. 6. మంచిసంగతినైనను, అధికవ్యామోహమునఁ జింతింపఁరాదు. 10. పరీక్షలో నఖండవిజయమున కైన నారోగ్యముఁ గోలుపోవరాదు. 11. ఈ విధులను జెల్లించుచు, దుస్సహవాసములు, దుస్సంకల్పములు, దుష్టదృశ్యములు - వీనిని త్యజింపవలయును."

విద్యారంగము సంరంభమునకు మూలమైనను, జీవయాత్రకు శక్తిని గలుగజేయుచున్నది. నవయౌవనో