పుట:2015.373190.Athma-Charitramu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విద్యారంగము : - విద్యారంగము జీవయాత్రకు సత్త్వాశ్రయము. పరిమితమైన గృహరంగమును విద్యారంగము విశాలము చేయుచు, జీవనప్రవాహమున కుత్తేజమును గలుగజేయుచున్నది. ఉపాధ్యాయులబోధలు, విద్యావ్యాసంగము, యువజనసాహచర్య సాంగత్యసంభాషణములు, ప్రాపంచిక వ్యవహారములును జీవయాత్రయందు సంఘర్షణమునకును, విషాదానందములకును మూలము లగు చున్నవి. గృహరంగమునకును, విద్యారంగమునకును నిత్యజీవనమునందు సంయోగసాహచర్యములు దుర్లభము లైనపుడు, సంఘర్షణము దుస్సహ మగుచున్నది. ఆత్మసంస్కారవిరహితమైన విద్యావిధానము, జీవయాత్రయందు గృహవిద్యారంగములకు సన్నిహితసాహచర్యము దుర్లభము చేసినవిధమును, ఆత్మచరిత్ర యందలి ఘట్టములు విశదము చేయుచున్నవి. తండ్రికొడుకుల దీర్ఘసంభాషణములసారాంశ మిటులు వారి 1900 ఏప్రిలు దిన చర్యపుస్తకమునందు గలదు: -

"మా జనకుఁడు జనాభిప్రాయమును శిరసావహించెడి భీరుఁడు; నే నన్ననో, స్వబుద్ధి సూచించినసత్యపథమునఁ బోయెడి ధీరుఁడను. ఆయన, పామరజనాచారములను గౌరవించి యనుసరించువాఁడు; నేను, వానిని నిరసించి నిగ్రహించెడివాఁడను. వే యేల, మా నాయన పూర్వాచారపరాయణుఁడు; నేను నవనవోన్మేషదీధి