పుట:2015.373190.Athma-Charitramu.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

33. క్రొత్తకోడలు, క్లిష్టపరిస్థితులు 147

చుట్టును విశాలస్థల ముండుటచేతను, స్వతంత్రత ననుభవించుటవలనను, కుటీరనివాసమె మాకు సుఖప్రదముగ నుండెను. కాని, అంతకంతకు మా కిచ్చటి కష్టములు బోధపడెను. ముం దుండెడి యెత్తగు పునాదుల మీఁద వేసినచో, ఈశాలయె యెంతో సౌఖ్యదాయకముగ నుండెడిది. అట్లుగాక వెనుకభాగమందలి పల్ల పునేల నుండుటచేత, వర్ష కాలమున నిల్లు చెమ్మగిల్లుచుండెను. ఆయింట వంట చేసికొనుట కొకగదిమాత్రమే ప్రత్యేకింపఁబడియుండుటచేత, పిల్లలము చదువుకొనుటకుఁ గాని, వచ్చిన బంధుమిత్రులు మసలుటకుఁ గాని, వసతి లేకుండెను.

మాతల్లి సీతమ్మ, తన జన్మస్థలమగు వేలివెన్నులో, సమవయస్సు గల అచ్చమ్మ యను బంధువులబాలికతోఁగలసి బాల్యమున నాడుకొను చుండెడిది. వీరిరువురు బొమ్మలపెండ్లిండ్లలో వియ్యపురాండ్రై వినోదించుచుండువారు. సీతమ్మ సామాన్యముగ పెండ్లికొడుకుతల్లియు, అచ్చమ్మ పెండ్లికూఁతునితల్లియు నగుచుండిరి. ఇపుడు వా రిరువురు పెద్దవారై పిల్లలతల్లు లయిరి. నేను సీతమ్మ పెద్దకుమారుఁడను. విద్యాభ్యాసకాలమున నాకు వివాహసంబంధము లనేకములు వచ్చినను, మాతల్లి, చిన్ననాఁటి చెలికత్తెతోనే వియ్య మంది, ఆమె పెద్దకూఁతురు రత్నమ్మను తన పెద్దకుమారునికిఁ జేసికొనఁగోరెను. అంత నాయిరువురుపిల్లకును, వారియొక్కయు వారితల్లులయొక్కయు జన్మస్థలమును. చిన్ననాఁటి యాటపాటలకుఁ దావలమును నగు వేలివెన్నులో, 1887 వ సంవత్సరము వేసవిని వివాహమయ్యెను.

1889 వ సంవత్సరమునందు, మామామగారగు వెలిచేటి బుచ్చిరామయ్యగారు, తమపిల్లల చదువునిమిత్తము స్వగ్రామమగు కట్టుంగ విడిచి, మావలెనే రాజమంద్రి కాపురము వచ్చిరి. ఆయన యేకపుత్రు