పుట:2015.373190.Athma-Charitramu.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 124

నపని జయప్రదముగ జరుగుటకై కృష్ణానదీదేవతకు బలి యిచ్చుటకు వారి నచటి కెగుమతి చేయుచున్నా రని వదంతులు ప్రబలెను ! కావున జనులు తమపిల్లల నింటియొద్ద జాగ్రత్తపెట్టుకొనవలె నని సర్కారు వా రిపుడు సాటింపించిరి. మా కుటుంబ స్థితిగతు లిపుడు విషాదకరముగ నుండెను. 1300 రూపాయలయప్పు పెరిఁగెను. పాపము, నిరుద్యోగి యగు మాతండ్రి యిది యెట్లు తీర్పఁగలఁడు ? నే నన్ననో, ముక్కుచు మూలుగుచు నున్నాఁడను. కనులకుఁగూడ నేదియో మూఁడినది ! ఇంక పరీక్షలో నపజయ మాపాదించెనేని, నాయదృష్టము పరిపూర్తి యగును ! తమ్ముఁడు వెంకటరామయ్య ప్రవేశపరీక్షకుఁ బోయియుండెను. అతఁడు క్రమక్రమముగ బుద్ధిమంతుఁ డయ్యెను. కాని, కృష్ణమూర్తి యింట నవిధేయతఁ గనఁబఱుచుచు, చదువునందు శ్రద్ధ లేకయుండువాఁడు. అతనిని, తక్కిన పిల్లలలోఁ గొందఱిని నదుపులో నుంచుట మాకుఁ గష్టముగ నుండెను ! విషమపరిస్థితులలో నేను ధైర్యము విడువక, ఈశ్వరపాదకమల స్మరణమే సర్వానర్థ హర మని నమ్మియుంటిని.

జనవరి 5 వ తేదీని లక్ష్మీనారాయణగారితో నేను షికారు బయలుదేఱి, మండలవై ద్యాధికారియగు కరూధర్సు డాక్టరును జూడఁ బోయితిని. కచేరిగదియందుఁగాక, నేను లోపలిగదియొద్దకుఁ బోయి తనను జూచినందు కాయన నామీఁద మండిపడెను ! యూరోపువారి యాచారపద్ధతులు నాకుఁ దెలియమియే దీనికిఁ గారణ మని నే జెప్పుటచేత, ఆయన నాతప్పు సైరించి, మఱునాఁడు నాకనులు పరీక్షించెను. రెండుకన్నులలోను చిన్న చుక్క లున్న వనియు, ముం దవి యెట్లు పరిణమించునో తెలియ దనియు, అవి పువ్వులక్రింద నేర్పడి నేత్రదృష్టి పూర్తిగఁ దొలఁగినపుడు శస్త్రము చేయవచ్చు నని