పుట:2015.373190.Athma-Charitramu.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28. పరీక్షావిజయము 123

అంత నూతన సంవత్సరకార్యవిధాన మిట్లు సూచించితిని : -

"1. పరీక్షలో జయమందినచో పట్టపరీక్షకును, లేనిచో మరల నీ పరీక్షకును, జదివెదను.

2. విజయము చేకూరునట్టుగ క్రమపద్ధతిని జదువు సాగింతును.

3. ఆరోగ్యమును గుఱించియు, ముఖ్యముగ నేత్రముల గుఱించియు శ్రద్ధఁ బూనెదను.

4. నా యుద్యమసాఫల్య విషయమై, సమత్వకార్యవాదిత్వములతోఁ గృషి చేసెదను."

అంత నే నిట్లు ప్రార్థన సలిపితిని : - "అనంతా ! ఈ దుర్బలశరీరముతో, నీకును, నీ సంతతయగు మానవకోటికిని నా వివిధవిధుల నెట్లు నెరవేర్పఁ గలను ? పరిశ్రమ యనఁగనే దుర్బలతచే నామేను కంపించుచున్నది ! ఐనను, ఒడలు దాచుకొనుట భావ్యము కాదు. నీ వొసఁగినగడువు మీఱక మున్నె, నావిధులు చెల్లించి, నీదయకుఁ బాత్రుఁడ నయ్యెదనుగాక !"

పరీక్షలు జరిగినపిమ్మట, నాసహపాఠి మిత్రులు తమ సెలవులకు వెడలిపోయిరి. అందుచేత రాజమంద్రిలో నే నేకాకిగ నుండవలసి వచ్చెను. జనవరి మొదటితేదీని వెంకటరావు బసకుఁ బోయి, యాతనిఁ జూచితిని. తండ్రి తనమీఁద గోపించె నని యతఁడు ఖిన్నుఁ డయ్యును, నన్నుఁ జూచి కొంత సేదదేఱెను. రాత్రివఱకు నే నచటనే నిలిచి, యూరట గలిగించితిని.

నేఁడు మే మొక వింతసాటింపు వింటిమి. కొందఱు దుష్టులు శిశువులను దొంగిలించి, యిపుడు బెజవాడదగ్గఱఁ గట్టెడి యేటివంతె