పుట:2015.373190.Athma-Charitramu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26. పరిక్షాపూర్వదినములు 113

నా నియమానుసారజీవితమును నీకొఱకు నీటఁగలుపనా ? నే నట్లు చేయను. సర్వసమర్థుఁడును, దయాసముద్రుఁడును నగు దేవదేవుఁడె నాకు శరణ్యము !"

కొలఁదిదినములలో కలకత్తాలోని "సాధారణ బ్రాహ్మసమాజ" ప్రచారకుఁడగు పండిత శివనాథశాస్త్రి యిచ్చటికి రానున్నాఁ డని మా కిపుడు తెలిసెను. ఆరాత్రి నే నింట మాటాడుచు, వీరినిగుఱించి ప్రస్తావించితిని. బ్రాహ్మమతమునుగుఱించి మావాళ్లతో నేను బ్రసంగించితిని. అపుడు మానాయనయు, పెద్దతమ్ముఁడును నన్ను ముట్టడించిరి. "హిందూమతము ఈశ్వరు నొప్పుచుండఁగా, నీ కేల దూరపు బ్రాహ్మమతము గతి యయ్యె ?" నని మాతండ్రి న న్నెత్తిపొడిచెను. ప్రసంగవశమున మాతమ్ముఁడు నాస్తికతను సమర్థించెను ! అలయుచు డయ్యుచు నే నంత నాపక్షమును నిలువఁబెట్టుకొనఁ బ్రయత్నించితిని.

ఆరాత్రి నాప్రార్థనమం దిటు లుండెను : - "ఓ భగవంతుఁడా ! నీ పుత్రకు లెంతటి మూఢత్వమున మునిఁగియున్నారు ! నీభక్తు లెట్లు బద్ధజిహ్వులై వారిమధ్య మసలుచున్నారు ! మతమునకు మానవహృదయమునకు సంబంధము లే దనియు, వర్ణ భేదముల పట్టింపులు, వట్టి బాహ్యపటాటోపములును మాత్రమే మతసార మనియు వా రనుకొనుచున్నారు ! నీ సత్యస్వభావము వా రెప్పటికి గుర్తెఱుఁగఁ గలరు ?"

11 వ నవంబరున నలుగురు స్నేహితులమును షికారుపోయితిమి. మాసంభాషణమునందు, కాంతయ్య లక్ష్మీనారాయణ కొండయ్యశాస్త్రిగార్లు మువ్వురును దివ్యజ్ఞానవిశ్వాసకు లని నా కీనాఁడు స్పష్టపడినది ! కావుననే వా రెపుడును మతో న్మాదమూఢాచారము