పుట:2015.373190.Athma-Charitramu.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

21. ముత్తుస్వామిశాస్త్రి విపరీతవిధానము 83

"ఈపద్ధతి నవలంబించినచో, జనులలో నిరసించెడి కాపట్యమును మనమె పూనుచుండుటలేదా ?" అని నే నడిగితిని. అట్లు కాదని యాతఁడు సమాధానము చెప్పుచు, "పూర్వాచారపరులకంటె మనమె మంత్రతంత్రములు బాగుగ పఠించి, కర్మకాండ జరుపుట యందు ప్రవీణుల మైతిమేని, ఇపుడు వారిదెసకుఁ బ్రవహించెడి ద్రవ్య వాహినిని మనవైపునకు మరలించుకొనవచ్చును. ఇట్లు మనము జనులను సంతృప్తిపఱచి, సంస్కరణపథమునకు మెల్లగ వారిచిత్తములఁ ద్రిప్పవచ్చును" అని శాస్త్రి బోధించెను. ఇట్లు పై కెంతో మంచివిగఁ దోఁచెడియెత్తు లాతఁడు వేయుచుండువాఁడు. పిమ్మట నేను వీరేశలింగముపంతులుగారితో నీసంగతి ప్రస్తావింపఁగా, "శాస్త్రిప్రణాళిక నవలంబించినయెడల, ఇప్పటి వైదికబృందమువలెనే మనమును తిండిపోతులముగను కుక్షింభరులముగను బరిణమించి, వట్టి భ్రష్టులమైపోయెదము !" అని యాయన వక్కాణించెను.

మే మాతనిని గలసికొని మాటాడినపు డెల్ల, శాస్త్రిలో నేదో యొకవింతమార్పును గనిపెట్టుచుండెడివారము ! భూపతనము నొందు పాదరసమువలెను, సంగీతపాటకునినోట 'సరిగమపదనిసల'వలెను, అతని మనస్సు సదా పలుపోకలు పోవుచుండెడిది ! ఉచితజ్ఞత యనునది యాతనిలో లేనేలేదు ! ఊహకు నూహకును గల పరస్పరసంబంధము కనిపెట్టి మఱి మాటాడుట కతని కోపికయె లేదు. కావుననే, స్థిరత్వము లేని చపలస్వభావుఁ డను నపయశస్సు ఆతని కావహిల్లెను. వివిధములు పరస్పరవిరుద్ధములు నగు విధానములఁ బన్నఁగలట్టియు, ఒరులనవ్వులు దుమదుమలును లెక్కసేయక తన విపరీతభావసందోహమును సమర్థింపఁగలట్టియు శక్తి శాస్త్రియందు మూర్తీభవించెను ! కాని, ఆతనియాలోచనలు మామిత్రుల కావశ్యకము లయ్యెను. దైవము గలఁ