పుట:2015.372978.Andhra-Kavithva.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

ఆంధ్ర కవిత్వచరిత్రము

ప్రథమ


పాలఁ జదువుఁడని పడవై చెను. వ్యాకరణ శాస్త్రము నిరంతరము పఠించుటవలనఁ సిద్ధములగు ధాతురూపముల విసర్జించి మారుమూలలనున్న రూపములనే వల్లించి ప్రయోగించుట తటస్థించును. కోఁతికిఁ గొబ్బరికాయ దొరకిన చందమున వ్యాకరణశాస్త్ర పరిచయ మబ్బినతోడనే యువకుల కన నేల, యారి తేరిన పండితులకు సై తము విపరీతములగు ధాతురూపముల యెడఁ బక పాతము మెండై స్వారస్యము నెడను, వైశద్యము నెడను సాదరమును సభిమానమును సన్నగిల్లి పోవుచున్నది, వ్యాకరణశాస్త్ర పారంగతులు కాని కవులు వ్యవహారమున నున్న పదములను, వానికుండు సుప్రసిద్ధరూపొంతరములను మాత్రమే సేకరించి యెల్లరకుఁ దెలియు నటులు స్వచ్ఛమును, మధురమును, సులభమును నగు భాషలో గ్రంథరచనఁ గావింపఁ గలుగుచున్నారు.

2. లింగవిభేదవిషయము.

ఇంతియ కాదు. వైయాకరణులు సృష్టికిఁ బ్రతిసృష్టిం జేయు టకుఁగూడఁ గడంగినారు. లింగ విషయమున నిరంకుశాధికార ధూర్వహులై పదములకుఁ దమయిచ్చవచ్చిన భంగి లింగముల దానముఁ గావించిరి. ఒకేపదమును స్త్రీలింగముగను, పుంలిం గముగను, నపుంసకలింగముగను వాడుచు, గవులకుఁ దీర రాని కష్టములఁ గల్పించినారు. వ్యవహారముననున్న పద్దతి కిని వైయా కరణకల్పితమగు పదముల లింగ పద్దతికిని భేద మెం తేనిఁ గన్పించును. వారియించ్చవచ్చినట్లు నీపదము స్త్రీలింగము, నీపదము నపుంసకలింగము, నీపదము పుల్లింగము ననుచు వైయాకరణు లవ్యాజకరుణమెయిఁ బదములకు లింగదానపత్రముల నొసగ