పుట:2015.372978.Andhra-Kavithva.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసాత్మకం వాక్యం కావ్యమ్.

33


నుండియుఁ బండితుల పిత్రార్జితమగు నాస్తివలె నున్న కవిత్వ సంపదను బ్రపంచమున నెల్లెడల విరఁజల్లి లో కాభ్యుదయ మునకు సెంతో తోడ్పడఁగలుగుదురు.

శాస్త్రైకవ్యాకరణము-విధినిషేధములు. 1. థాతురూపములు.

కాని మనవైయాకరణులు కావించిన మహోపకార మెయ్యది? ఒక్కొక థాతువునకు బహుళ సంఖ్యాకములగు రూపాంతరములఁ గల్పించిరి. విచిత్ర నియమములచే నెల్లం గల్పింపఁబడిన రూపాంతరములన్నియు వ్యాకరణశాస్త్ర గ్రంథ స్ధములుగ నున్నంతమాత్రమున, నిఘంటువులమూలల నడఁగి యున్నంతమాత్రమునఁ, బ్రజలచే వ్యవహారమున నిత్యము వాడఁబడకుండినను,గవుల చే గ్రంథముల విరివిగ నుపయోగింపఁ బడకున్నను, నగమ్యగోచరములుగ నున్నను, వైయాకరణుల చేతియక్షతలు తలలపై బడినంతనే సాధువులగు చున్నవి. దైవ కరుణ చేతను, మన యదృష్టవశమునను మహాకవు లెల్లరు నీ యసంఖ్యాకములగు రూపాంతరములకుఁ దమగ్రంథములఁ దావీయరైరి గాని, యిచ్చినచో గన్నులపండువుగ నుండు కావ్వ ప్రపంచమంతయు రాలురప్పల తోను, ముండ్లుమోఁడులతోను నిండియుండెడిదే. సంస్కృతమున ధాతురూపముల సన్నిటి నుపయోగించు నుద్దేశముతో వ్రాయఁబడిన “భట్టికావ్య "మను నొక గ్రంథమున్నది. సాహిత్యమును బిత్రవస్తు ప్రదర్శనశాలగ' భావించి యిన్ని మహా కావ్యము లుండఁగ నిట్టగచ్చపొదపంటి నిరర్థక కావ్య మేల యుండఁగూడదని యెంచియేకాఁబోలు కవి. శ్రమమంతయుఁ వృథఁబుచ్చి యీగ్రంథమును రచించి మన ఆంధ్ర కవిత్వ---3