పుట:2015.372978.Andhra-Kavithva.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

భావప్రకటనము.

300



వారు పాణిగ్రహణముఁ జేసికొనజూలక శృంఖలాబద్దయు , శల్యావశిష్టయు నగు నీయర్వాచీనసంస్కృత కావ్య జీవచ్ఛవము లను పలచి, తత్సాంగత్యమునఁ జొక్కి మత్తిల్లి, సలక్షణముగ సంస్కృత సాహిత్యమును జదివి తధ్ర సమును సౌందర్యమును ననుభవిం చెదమనియు, నట్టి యనుభవమంతయు సాంధ మునఁ జొన్పించి యాంధ్ర భాషను సంస్కృతమంత దానిని జేతు మనియుఁ బల్కు. మన పండితుల పల్కులు ' ప్రగల్భమాత్ర, ములై యున్నవి.

ఆంధ్ర సాహిత్యమున 'స్వాతంత్య్రమును సాంధ్ర త్వమును నభ్యర్ధనీయములుగాని సంస్కృతపారతంత్య్రము కాదు.

ప్రపంచమున స్వాతం త్రేచ్ఛ పేర్లు వెల్లువగ వ్యాపించు చున్న యిక్కాలమున సంస్కృతపొరతంత్య్రమును సాంధ్ర... భాషాభిమానులు ఇచ్చగింపజాలరు. ఆంధ్ర భాషకుస్వాతంత్ర్య. మును బ్రత్యేకజీవనమును గలవనియు, నాంధ్ర భాషకుఁగల విల తణతయే యాంధ్ర కవుల కావ్యకల్పనల ధారభూతమనియు, నూరక సంస్కృతపద్దతుల ననుకరించుట బానిసలకు సహజ మగు పారతంతమును వెలికిఁ జూపించుటయే యగుంగానీ తన్మాత్రమున నాంధ్ర భాషకు స్వతస్సిద్ధముగ లేని గౌరవము రాజాలదు. ఎవరియింట వారు నివసించుచుఁ జుట్టపక్కముల భాతి రాకపోకలు సల్పుచున్నప్పుడే చుట్టఱకపు పెంపు. సొంపునింపుఁగాని యూరక యొకయింటివారు వేరొకరియింట దేఱతిండిఁ దినుచు , సూడిగము చేయుచు నుండ నీట్టి చుట్టరి కము ముచ్చటగను సౌఖ్య ప్రదముగను నుండఁజాలదుగదా!