పుట:2015.372978.Andhra-Kavithva.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

302

ఆంధ్ర కవిత్వచరిత్రము

షష్ట


ఆట్లే ఆంధ్ర భాషయు స్వతంత్రశక్తిఁ గలిగి ప్రత్యేకవిలక్షణము లతో సహజసౌందర్యములో నొప్పిన నొప్పగుఁగాని యూరక సంస్కృతమున కూడిగము సలుపుచు నామె యొసఁగు దాన ములనుగాని, యెరవు సొమ్ములనుగాని, ధరించి కులికినచో సట్టి యెరవు సొములన్నియు బరువు చేటే యగుంగాని యాంధ్రము నకు వన్నెయు వాసియుఁ దేఁజూలవు. ఆంధ్రమునకుఁ బ్రత్యేక విలక్షణత గలదు. ఆంధ్రులకుఁ బ్రత్యేకచరిత్ర గలదు. ప్రత్యేక నాగరికమును గలదు. భారతీయ యువతులలో సాంధ్ర,యువతి ప్రత్యేకసౌందర్యముతోను, ప్రత్యే కాలంకరములతోను శోభి ల్లుచుండును. ఆంధ్రవీరుల కార్యోత్సాహమును పరాక్రమ మును స్వాతంతానురక్తియు జగత్ప్రసిద్ధములు. ఇఁక నాంధ్ర దేశమునందలి పుణ్యతీర్ణములును, దివ్యస్థలములును, బ్రకృతి . శోభావి శేషంబులును, నాంద్ర నగరముల వైభవమును, ఖండాం తరవాసుల పొగడ్తలఁ గూడ నందినవి. అట్టిచో నిన్నింటఁ బ్రాశస్త్యము వహించిన యాంధ్రుల భాష మాత్రము పార తంత్ర్యావస్థ యేల ననుభవింపవలయునో దురూహ్య మవు చున్నది. భారత దేశమం దున్న వివిధజాతులకుఁ బరస్పరసం బంధమును, సంయోగమును గూచ్చుచున్నది సంస్కృత భాషయే యగుంగాక! ప్రాచీన భారతీయ నాగరికత యెల్ల సంస్కృతము నంద యిమిడియుండుంగాక, అంతమాత్రముననే యాంధ్రత్వము నశింపవలయు ననుట పొసంగని మతము. ఆంధ్రుల సహజ ప్రతిభ నేడు భాషాముఖమున వ్యాప్తి నందుట యెల్లర కును నభ్యర్థనీయమే. ఈ భావమును బురస్కరించుకొనియే - “అనఁగా నాంధ్ర కావ్యములందలి యాంధ్రత్వమును బట్టియే 'యాంధ్ర సాహిత్యము యొక్క. బాగోగులను విమర్శింతము.