పుట:2015.372978.Andhra-Kavithva.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

భావ ప్రకటనము.

293


సాహిత్యము ముందు పుట్టి పద్యకవిత్వము తరువాత పుట్టినదని కాదు. ప్రపంచ సాహిత్య చరిత్రలయం జెల్లెడలను పద్యకవి త్వమే ముందు ప్రభవిల్లి ప్రజల వశీకరణము గావించికొని తప్తముఁ జేసిన పిదపనే వచన సాహిత్య ముద్బవించి జ్ఞానోపదేశ మునకుఁ గడంగెనని తెలియుచున్నది. కావున నెన్ని" చెప్పినను పద్యమే ముందు కాని, గద్యము కాదు.

భాషాతత్త్వము.

జీవద్భాషలకును పురాతన భాషలకును గలసంబంధము.

భాష యనఁగా నేమి? అర్థము నొసఁగు మాటల కూర్పు. అర్ధమే భాష మనఁబడును. భావమునకును భాషకును నవినాభావసంబంధము కలదు. అర్థము నీయని మాటయు, మాటల కలవిగాని యర్థమును గగనారవిందము లనియు, అనుకరణము లకుంగూడ వ్యవహారము ననుసరించి నిశ్చితార్థముండుననియు, నీది వఱకు గ్రహించియే యుంటిమి. అర్థద్యోతకళబ్దసముదాయమే భాష.

జీవద్భాషాస్వభావము.

భాషయన నేమో తెలిసినది, జీవద్భాషయనఁగ నేమో యింక నెఱుంగవలెను, మానవుని చే నిత్య వ్యవహారముల నుప 'యోగింపఁబడుచుండు తన జీవించునదియే జీవద్భాషయగును. జీవద్భాష మానవుని జీవితమును, దానియొక్క పరిణామ భేదములను, జీవితర హస్యములను, మానవుల యాచారవ్యవ హారములకు సంబంధించిన విశేషములను, వారికుండు నాగరకతా లక్ష్యములును సర్వము నద్దమునందు వలె బ్రతిఫలింపఁ జేయును. అద్దమున 'మన మొగములు మనము చూచుకొని