పుట:2015.372978.Andhra-Kavithva.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

292

ఆంధ్ర కవిత్వ చరిత్రము

షష్ట


బడినది, నాగరతయు విజ్ఞానమును సభివృద్ధి నొందినదొలఁది వచనరచన యతిశయించి "పద్యమునకుఁ బ భ్రంశము సంభ వించినది. కావునఁ బచ్య మే ముందు గాని, గద్యము కాదు!

చమత్కారజనకమగు నీంకొక సిద్ధాంతము.

కాని, ఆంగ్లేయ భాషలో “Poetry begins where prose ends" అను సిద్ధాంతము కలదు. ఆసిద్దాంతము ప్రకారము వచన సాహిత్యాంతమున పద్యకవిత్వ ముద్భబవించునని తేలుచున్నది. కాని, పై రెండు సిద్దాంతములకును గల విరోథాభాసత్వము నామమాత్రముననే గాని, నిజముగ లేదనియు విచారణానంతరము తెలియఁగలదు. Poetry begins where prose ends (పచన సాహిత్యాంతమున పద్య కవిత్వ ముద్భవించును.) అను సిద్ధాంత ముయొక్క భావ మేమనఁగా; పచన సోహీత్వ పరమావధీజనోప దేశ మే, జానోపదేశముఁ గావించిన తోడనే వచన సాహిత్యపర మార్థము సిద్ధించిన దగును. భావోద్రేకము కలిగించుట కావ్య ముయొక్క 'పని, భావోద్రేకము గలిగించుటయే కవిత్వము యొక్క ముఖ్య కర్తవ్యము. కవిత్వమున జ్ఞానోపదేశ మంత ప్రథాన విషయము కాదు. వచన సాహిత్య మేవిషయము ప్రధాసముగా గ్రహించునో పద్య కవిత్వము దానిన ప్రధానమని లోని పుచ్చును. పద్య కవిత్వమే విషయము ప్రధానమని భావించునో దానిని వచన సాహిత్యము తగిన రీతిని నిర్వహింప సమర్థము కాదు. వచన సాహిత్యము నిర్వహింపఁ జూలక వదలిన పనిని పద్య కవిత్వము అవలీలగ నిర్వహింపఁ గలుగును. పద్య కవిత్వము వచన సాహిత్యముకన్న నెక్కుడు భావోద్దీపకమును, ఆత్మవశీ కరణమును ననియే పై సిద్ధాంతము యొక్క భావము "జాని, వచన