పుట:2015.372978.Andhra-Kavithva.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



తృతీయ ప్రకరణము.


1. మానవధర్మమున రసము దేని నాశ్రయించికొనును?

రసస్వరూప మెట్లుండునో కొంతవఱకు నిరూపించితిని. రసమునకుఁగల వివిధావస్థలను పరిణామ భేదములనుగూడ వివరించితిని. ఈ ప్రకరణమున మానవధర్మమున రసమును, అది యాత్మగాఁగల కవిత్వమును వేని నాధారముగాఁ గొనునో సూచించి చర్చింప నెంచితిని.

మానవధర్మముయొక్క నిరీక్షణము. 

మానవధర మన నేమి? దానియుపయోగ 'మేమి? అందు రసమునకును, రసాత్మకమగు కావ్యమునకును నేమైనఁ దావుండునా? పై ప్రశ్నములకు జవాబు నొసఁగుట వివాదాంశము నింకొకదానినిఁ బై కి ద్రవ్వితీయుటయే యగును. అయినను నట్లు చేయక తప్పదు. మానవధర్మమునకు మూలస్థానము మాన వునియందున్న భగవదంశ మే యని గ్రహింపనగును. మాన వుఁడు భగవదంశాసంభూతుఁడని మనమత క ర్తలును వేదాంతు లునుగూడ నొప్పికొనిరి. వేదాంతులు మీఁదుమిక్కిలి మాన వుఁడును భగవంతుఁడును నొకటియే కానీ 'రెండు భిన్న వస్తు వులు కారని నిర్ణయించిరి. ఈమానవుని భగవదంశము నాధారముగఁ గొని మానవుఁడు తనజనమును సార్థకముఁ గావించి కొని భగవంతునిఁ జేరుటకుఁ దగినయుపాయములను నియమ ములను నిర్మించి మానవధర్మమును బ్రతిష్టాపనఁ గావించిరి.