పుట:2015.372412.Taataa-Charitramu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పట్టుకు బదులు ఆవిదేశపు పట్టునే మనదేశమందును కొనుటచే, మనపరిశ్రమ క్షీణింపదొడగెను.

జంషెడ్జి ఇంగ్లండుకు వెళ్ళినప్పుడు, ఫ్రాన్సు ఇటలీలం దాగి, అచ్చటి పట్టుపరిశ్రమ పద్ధతులను జాగ్రత్తతో గమనించెను. అవి మనదేశమున గృహపరిశ్రమగ నుండుటకు వీలుకలదని కనిపెట్టి, ఆయన మచ్చునకు కొన్ని ప్రశస్తమగు కొత్తరకపు పట్టుపురుగులను మల్బర్రీ విత్తనములను ఆపరిశ్రమ కుపయోగించు కొన్ని పనిముట్లను మనదేశముకు తెచ్చెను. ఇచట మైసూరులో బెంగుళూరు ప్రాంతపు పీఠభూమి సమశీతోష్ణమై, ఈపురుగులును మల్బర్రీ చెట్లును వృద్ధియగుటకు ఎంతయు తగియున్నది. టిప్పూసుల్తానుకాలమున గూడ, ఆప్రాంతమున మల్బర్రీ తోటలు పెంచబడెను. అందుచే తాతా యాప్రాంతమున కొంతవిశాల స్థలమును కొని, అందు మల్బర్రీతోటల బెంచి, ఆపట్టుపురుగుల వృద్ధిజేసెను.

తానారంభించు పరిశ్రమకు ప్రపంచమందన్ని ప్రాంతములలో నెట్టి విశేషపద్ధతు లవలంబింపబడినవో తెలుసుకొని, అవి యిచటి పరిస్థితులకు తగియున్నచో పరీక్షించి, వ్యయప్రయాసముల కోర్చి, అట్టి నవీనపద్ధతులతోనే తనపరిశ్రమల నడుపుట తాతా కలవాటు. ఈపట్టుపరిశ్రమను శాస్త్రీయముగ వృద్ధిచేసినవారిలో జపానీయులు ముఖ్యులు; వారు యూరపియనులవై జ్ఞానికయంత్రముల వాడుచు, వానిని ప్రాచ్యజనుల