పుట:2015.372412.Taataa-Charitramu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కనుకూలముగ గృహపరిశ్రమ పద్ధతిని నడుపుచున్నారు. వారు పాశ్చాత్యపద్ధతులను ఆసియాలోని గ్రామపరిసరముల కనుకూలముగ సమన్వయించుటలో దిట్టలని జంషెడ్జి గ్రహించి, తాను 1893 లో స్వయముగ జపానుకేగి, ఆపనివాండ్ర నేర్పును, పురుగుల జంపకుండ సుళువుగ గూడులనుండి పట్టితీసి వడకుటకు వారు వాడుయంత్రములను, గమనించెను. అవి యూరపుపద్ధతుల కన్నను ప్రశస్తములు; అందుచే జపాను నుండి కొందరువిజ్ఞులను రప్పించి, జంషెడ్జి తనతోటలందు వారినుద్యోగులుగ నియమించి, ఆపద్ధతులను, ఆపరిశ్రమలోని చర్యలన్నిటిని, ఇచ్చటి యువకులకు చక్కగ నేర్పించెను. ఆకులకు పురుగు పట్టినచో అవలంబింపవలసిన పద్ధతులను, యాంత్రిక విశేషములను గూడ, మన యువకులు నేర్చుకొనిరి. ఆపరిశ్రమ మర్మములన్నియు బోధించినమీదట, ఆజపానీయులు తిరుగ తమదేశముకును పంపివేయబడిరి.

తాతాచేయు కృషికానందించి, అప్పటి మైసూరు ప్రభుత్వమువారు తమదివానగు సర్ శేషాద్రి అయ్యరుద్వారా, తాతాగారి పట్టుతోటపరిశ్రమకు సాలీనా రు 3000 లు చొప్పున కొన్ని యేండ్లవరకు విరాళమునిచ్చుచు సహాయము చేసిరి. తనతోటలందు కొందరు మైసూరు యువకులను గూడ పట్టుపరిశ్రమలో విజ్ఞులనుగ తయారు చేసెను. తాతా సహజముగ ఆరామ ప్రియుడు; ఆ తోట నాదర్శవనముగ జేసెను. ఆతోటలో తయారైన పట్టు చాల ప్రశస్తముగ నుండి, విదేశపు రకము