పుట:2015.372412.Taataa-Charitramu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముడివస్తువులకు ధరలు హెచ్చి, వ్యవసాయముకును ప్రోత్సాహము కలుగును.

మనదేశమున వస్తువులలోటు లేదు. ఈవిశాలదేశమున అన్నిశీతోష్ణపరిస్థితులు అన్ని రకముల నేలలును గలవు. ఐనను మనదేశము వ్యవసాయముకే తగినదని, కొందరనుట పరిపాటిగ నుండినది. ఆసంగతి నిజము కాదనియు, తగు మనోనిశ్చయముతో కృషిసల్పినచో, ఈదేశమందును ముఖ్యపరిశ్రమ లేర్పడి యార్ధికస్థితి బాగుపడు ననియు, తాతాచరిత్రము సహేతుకముగ విశదము చేయును. ముఖ్యముగ, మన యాంధ్రప్రాంతమున పెద్దపరిశ్రమ లేవియు లేవు. ఉన్నపరిశ్రమ లైనను క్షీణించుటయో, పరహస్త గతములగుటయో, జరుగు చున్నది. జనులలో, ముఖ్యముగ విద్యావంతులగు యువకులలో, నిరుద్యోగత విపరీతముగ హెచ్చుచున్నది. ఇట్టి దయనీయ పరిస్థితి చాలయనర్ధములకు కారణమగుచున్నది. ఒకవిధముగ మన దేశమందలి వివిధ బాధలన్నిటికిని, పరిశ్రమలు లేకుండుటచే యువకులలోనున్న వృత్తిహీనతయే కారణమని తోచును.

అందువలన ఆధునికభారతదేశపు పారిశ్రామికనాయకులలో నగ్రగణ్యుడగు జంషెడ్జితాతాచరిత్రము మనయువకులలో కొంతవరకైన స్వతంత్రవృత్తి సంపాదనకు ఆర్థికోన్నతికి ఉత్సాహము కల్గింపవచ్చుననియు, ఆరీతిగ నీచిన్న పుస్తకము కొంచెము జనోపయోగకరము కావచ్చుననియు, తలచి దీనిని