పుట:2015.372412.Taataa-Charitramu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రహింతురు. తాతాగారి జీవితము మనదేశపు పారిశ్రామిక చరిత్రముతో అభేద్యముగ మిళితమై యున్నది. ఆ యాసమస్యల చర్చ సందర్భమున ఇం దాపరిశ్రమల ప్రశంస అవసరము, ఉపయోగకరము, అగుటచే, సందర్భవశమున వాని నుదహరించితిని. శైలికి పారిభాషికపదములకు నా 'జగత్కథ' లోని పద్ధతినే యవలంబించితిని; ఈపుస్తకమును వ్రాసిప్రచురించుటలోను చి|| ప్ర|| పార్ధసారధి (బి. ఏ., బి. కామ్; ఎల్. ఎల్. బి.) నాకు సాయము చేసెను.

భారతదేశమం దిప్పుడు వ్యవసాయమే ముఖ్యవృత్తి, ప్రభుత్వపులెక్కలప్రకారమే ముప్పాతికమంది జనముకు వ్యవసాయమే జీవనాధారము. (అనగా, ఇంతమందియు నిజముగ వ్యవసాయాదులు చేసికొనుచు స్వయముగ తమ్ము తాము పోషించుకొనుచున్నారని తలపకూడదు. ఇందులో మిక్కిలి కొద్దిమందికే వ్యవసాయపుపని దొరకుచున్నది. కొలదిమంది యీనాందారులుగ శిస్తుల గ్రహించుచున్నారు; తక్కినవారందరు తాము నిరాధారులగుటవలన, కర్షకులవలననో భూనాయకులవలననో, అనుబంధముచే కరుణయా పోషింప బడుచున్నారు; ఐనను, లెక్కలలో వారికిని వ్యవసాయమే వృత్తి యనుట వాడుక) మరియు సాగుదార్లకు పూర్వము అనుబంధవృత్తులుండినవి. ఇప్పుడు వ్యవసాయము లేనిరోజులలో రయితులు తరుచు వ్యర్ధముగనే యుండుచున్నారు. పరిశ్రమలు హెచ్చినచో