పుట:2015.372412.Taataa-Charitramu.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తయారుకాని నిత్యావసరములగు అనేక యాంత్రిక వస్తువుల నిప్పుడు మనదేశీయులు తయారు చేయుచున్నారు.

కాని ఆయనజాతీయతలో విదేశీయులపై ద్వేషములేదు. ఆయన తన జ్యేష్ఠపుత్రునికి ఆంగ్లదేశమున విజ్ఞానవిద్యకు కేంద్రమగు కేంబ్రిడ్జిలో విద్యాభ్యాసముచేయించెను. ఆంగ్లేయులు ఇతరవిదేశీయులు నెందరో యీదేశమున, విదేశములందుగూడ, ఆయనకు మిత్రులైయుండిరి. జంషెడ్జి జాతీయవాదియైనను, పెద్ద యుద్యోగులకు బొంబాయిగవర్నరుకు, అప్పటి రాజప్రతినిధియగు కర్జనుప్రభువుకు, లండనులో భారతమంత్రికిగూడ, ఆయనయందు చాలగౌరవభావ ముండెను. తగు భారతీయులు దొరకని (ప్రత్యేకప్రజ్ఞ నైపుణ్యము కావలసిన) కొన్ని కార్యములకై, ఆయన కార్యాలయములందు, (విజ్ఞులగు) పాశ్చాత్యులును ఉద్యోగులుగ నుండిరి. ఆయన ఇట్లు సర్వసముడయ్యు స్వేదేశమం దమితప్రేమ గల్గియుండెను.

బొంబాయిహైకోర్టులోను, తరువాత కలకత్తాహైకోర్టులోను ప్రధానన్యాయాధిపతిగ నుండి, ఇటీవల ప్రీవీకౌన్సిలు జడ్జిగనుండిన సర్ లారెన్సు జంకిన్సుగారు జంషెడ్జితాతా నిరాడంబరుడని ఆయనమాతృదేశభక్తి మితిలేనిదని తమసదభిప్రాయము తెల్పిరి. *[1]

  1. * Wealth came to him in full measure, but he remained to the last what he was by nature, a simple, modest man, seeking neither title nor place, and loving, with a love that knew no bounds, the country that gave him birth."