పుట:2015.372412.Taataa-Charitramu.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వారియం దిప్పుడు లోపించియున్న, గుణశక్తు లన్నియు జంషెడ్జితాతాయందే మూర్తీభవించెను." అని యొక యాంగ్లచారిత్రకుని వచనము. *[1] చుట్టును వలయునంత జనుము పండుచున్నను, దగ్గరనే రాణిగంజిలో బొగ్గుగనులున్నను, తగినంత విజ్ఞానము వ్యాపారదక్షతలేక, వంగదేశమున జనపనార మిల్లులను మనదేశీయులు స్థాపింపలేదు. ఇంతలో విదేశీయు లా సౌకర్యములగనిపెట్టి కలకత్తాప్రాంతమున అట్టిజనపనారమిల్లుల చాల స్థాపించి, సాలీనా కోట్లకొలది రూపాయలను లాభముగ గ్రహించుచున్నారు. జనపనార (ప్రపంచమంతటను మనదేశమందు మాత్రమే సమృద్ధిగ పండును. మనదేశమునగల ప్రకృతిసౌకర్యముల నుపయోగించుకొనక మనము విడచినచో, వానినిబట్టి విదేశీయులిచటనే పరిశ్రమల స్థాపించుకొందురు; అంతట వానిని మనదేశీయులు మరల స్వాధీనముచేసుకొనుట సుసాధ్యము కాదు.)

జంషెడ్జి తాతా స్వశక్తిని నూతన పరిశ్రమల వృద్ధిలోనే కేంద్రీకరించి, వానిని జయప్రదముగనడపెను. భారతీయులు పెద్దపెద్ద పరిశ్రమల నడుపలేరను అపవాదమును తాతా, తరువాత ఆయనమిత్రులును, తొలగించిరి. ఇదివరలో మనదేశమున

  1. * "There has been hardly any other man among its millions who may more fitly be said to have united within himself the qualities of which the Indian people are greatly in need, ('India under Curzon and after' by Lovat Fraser P. 321.)