పుట:2015.372412.Taataa-Charitramu.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బొంబాయి రాగానే, జ్యేష్ఠపుత్రుడగు దొరాబ్జిని మిత్రులను కలుసుకొని, జంషెడ్జితాతా ఆయాపరిశ్రమలగూర్చి విదేశయాత్రలో గ్రహించిన కొత్తసంగతులను, చేసిన పనులను, వారికి తెలిపెను. కొంతకాలమునుండి అస్వస్థతతోనున్న జంషెడ్జి యీనిరంతరకృషిచే నింకను జబ్బుపడెను. ఆయన మన శ్శక్తిమాత్రము పోలేదు. కుమారునికిని ఆయాపరిశ్రమల యుద్యోగులకును ఆయన అమూల్యములగు చాల సలహాల నిచ్చెను. తన విదేశానుభవములను వారికి తెలిపి, తా నాపరిశ్రమలకై సేకరించిన సామగ్రులను వారి కందజేసి, వారికి కార్యదీక్ష కల్గించెను.

దొరాబ్జి తాతాకు మేనమామకొడుకగు షపుర్జీ సక్లత్వాలా అను ధీశాలియగు యువకు డిదివరలో జంషెడ్జీతో తిరిగి, చందాజిల్లాగనులం దనుభవము గల్గియుండెను. *[1] ఆతడు,

  1. * ఈసక్లత్వాలా లోహపరిశ్రమ స్థాపనలో తాతాకంపెనీకి చాలసాయము చేసెను. తరువాత ఈయన ఈకంపెనీవారి లండను కార్యస్థానమున పనిచేయుచు, ఆంగ్లస్త్రీని పెండ్లియాడి, ఆంగ్లదేశమందే యుండెను. దరిమిలాను బ్రిటిషు కార్మికోద్యమమున పాల్గొనుచు, తీవ్రభావములుగల కమ్యూనిస్టు (సామ్యవాది) ఆయెను. సామ్యవాదము కాపిటలిజముకు (పుంజీపతిపద్ధతికి) కేవల విరుద్ధము అందుచే, సక్లత్వాలా తాతాకంపెనీతో సంబంధము వదలుకొని, బ్రిటిషు సామ్యవాదుల నాయకుడుగ పార్లమెంటులో సభ్యుడై కొంతకాలము పనిచేసెను. ఇంగ్లండులో భారతీయుల పక్షమున ధైర్యముతో పనిచేయుచు, ఆదేశమున మనదేశీయులకు సాయపడుచుండెను. ఈయన 1935 సాలాఖరున లండనులో చనిపోయెను.