పుట:2015.370800.Shatakasanputamu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     త్తమరాజ్యస్థితిపట్టభద్రుఁ డగు సద్భక్తుండు సర్వేశ్వరా!37
మ. ప్రకటింపంగ సమస్తపాతకములం బాపంగ నీ పూజయం
     దొక పుష్పాంశము చాలునన్న మహిలో నూహింపఁగా నీ పదా
     ర్చకు లేమార్గమునందు శుద్ధులు మదిం జర్చింపఁ దద్దుర్గుణ
     ప్రకరం బెన్నెడివాఁడు లోకములలోఁ బాపిష్ఠి సర్వేశ్వరా!38
మ. తమ తేజంబుఁ దృణీకరించుచు సముద్యత్తేజులై మీఁదిలో
     కములందున్ జరియించు నీ యచలభక్తశ్రేష్ఠులం జూచి నె
     య్యమునం దారును దద్విధంబునను నిన్నర్చింప నూహించి మ
     ర్త్యమునం బుట్టఁగ వాంఛసేయుదు రమర్త్యశ్రేణి సర్వేశ్వరా!39
మ. అమరన్ భక్తులకెల్ల నీవ హృదయంబై యుండుట న్వారి సౌ
     ఖ్యము నీ సౌఖ్యము వారి కూర్మియు సమగ్రంబైన నీ కూర్మిత
     త్త్వము భావింపఁగ వారి కోపము భవత్ప్రఖ్యాతరౌద్రప్రభా
     వము దా వారల వాక్యనిర్ణయము నీ వాక్యంబు సర్వేశ్వరా!40
మ. అవనిం బెన్నిధి భాగ్యహీనునకుఁ బ్రత్యక్షంబు గాకప్పు డొం
     డవ భాండాకృతిఁ దాల్చి మాఁటువడి మాయావృత్తి నున్నట్లు దా