పుట:2015.370800.Shatakasanputamu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ. సికతాధామము నీకుఁ జేసి మదిలోఁ జెన్నొంది క్రీడించు బా
     లకు లింద్రాధికులన్న నీ గుడు లతిశ్లాఘ్యేష్టకాష్ఠాదులన్
     సుకుమారంబుగ నెత్తి భూతలములో శోభిల్లు వంశప్రదీ
     పకు సౌభాగ్యము మాన మెవ్వరికిఁ జెప్పన్వచ్చు సర్వేశ్వరా!34
మ. భవదభ్యర్చనవేళలన్ భవుల సంపద్భ్రాంతులన్ దీనమా
     నవులన్ విద్విషులన్ భవాతురుల సన్మానించుటల్ సౌఖ్యము
     ఖ్యవిహారేచ్ఛలు నీ మహత్త్వములు నిత్యానంద మూహించుచో
     భువి నీ భక్తుల కాత్మలో విరసము ల్వుట్టించు సర్వేశ్వరా!35
మ. కరుణం జేకొనిరేని రౌరవపదగ్రస్తాత్తు దేవేంద్రుఁగాఁ
     బరగం జేయుదు రాత్మలో నలిగిరేఁ బర్జన్యు నా రౌరవో
     త్కరపంకప్రవిలీనకీటకముఁగాఁ గల్పింతు రన్నట్టిచో
     నరయన్ భక్తుల శక్తి యెట్లు గుఱిసేయ న్వచ్చు సర్వేశ్వరా!36
మ. రమణీయక్షితిపాలుఁ డింద్రుని చతుర్మాసక్రమాయుష్యుఁ డా
     యమరేంద్రుం డజునాడికాద్వయమువాఁ డా బ్రహ్మ యుష్మన్నిమే
     షమువాఁ డంచును వీరినెల్ల నగు నీ సాలోక్యసామీప్యస