పుట:2015.370800.Shatakasanputamu.pdf/482

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసన్నరాఘవశతకము

529


[1]సన్నను నావీమానములఁ జక్కగఁ జూచుచునుండ నెవ్వరున్
[2]తన్నట వేడ్కఁ జూచు టది తప్పకయుండె ప్రసన్న ...

177


ఉ.

మింట మృదంగనాదములు మిక్కుటమై చెలఁగంగ నిక్కడన్
దంటబలీయమేళములు తప్పెటబూరలు పిల్లఁగ్రోవులన్
మింటనె గప్పి పుష్పముల మేదిని నాముని వేషభాషలన్
అంటె చెలంగుభాషణుల నంతట నప్డు ప్రసన్న...

178


ఉ.

వీథు లలంకరించి రటు విప్రులు రాజులు వైశ్యశూద్రులున్
వీథుల తోరణంబులును వింతవినోదము లైనచోద్యముల్
వీథులఁ బచ్చికస్తురియు వేడుకగా మఱి మేళరాజ్యముల్
వీథులవీథులం బ్రజలు వేడ్కలు సేయఁ బ్రసన్న...

179


ఉ.

 ఏనుఁగులు న్రథంబులును నెక్కుడుగుఱ్ఱములు న్మహోష్ట్రముల్
మానుగ మంత్రివర్గమును మంచిపదాతులు సర్వసేనలున్
వానరసేనలు న్మఱియు వారలభేదము భల్లుకంబులున్
దానవమూఁకలుం గదిసి తర్లకయుండెఁ బ్రసన్న...

180
  1. సరగున
  2. తరుణులు