పుట:2015.370800.Shatakasanputamu.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     ర్మలినమనోవి కారినగుమర్త్యుని నన్నొడఁగూర్చి నీపయిం
     దలఁపు ఘటింపఁజేసితివి దాశరథీ! కరుణాపయోనిధీ!22
ఉ. కొంజక తర్కవాద మనుగుద్దలిచేఁ బరతత్త్వభూస్థలిన్
     రంజిలఁ ద్రవ్వి కన్గొనని రామనిధానము నేఁడు భక్తిసి
     ద్ధాంజనమందు హస్తగతమయ్యె భళీ యనఁగా మదీయహృ
     త్కంజమునన్ వసింపుమిఁక దాశరథీ! కరుణాపయోనిధీ!23
ఉ. రాముఁడు ఘోరపాతకవిరాముఁడు సద్గుణకల్పవల్లికా
     రాముఁడు షడ్వికారజయరాముఁడు పాథుజనావనవ్రతో
     ద్దాముఁడు రాముఁడే పరమదైవము మాకని మీయడుంగుగెం
     దామరలే భజించెదను దాశరథీ! కరుణాపయోనిధీ!24
ఉ. చక్కెర మాని వేముఁ దినఁజాలినకైవడి మానవాధముల్
     పెక్కురు బక్కదైవముల వేమరు గొల్చెద రట్లు కాదయా
     మ్రొక్కిన నీక మ్రొక్కవలె మోక్ష మొసంగిన నీవ యీవలెం
     దక్కినమాట లేమిటికి దాశరథీ! కరుణాపయోనిధీ!25
ఉ. రా కలుషంబు లెల్ల బయలం బడఁ దోరాచినమాకవాటమై
     దీకొని ప్రోచు నిక్కమని ధీయుతు లెన్నఁ దదీయవర్ణముల్