పుట:2015.370800.Shatakasanputamu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దాన ధర్మములఁ జేయ-నేర, నీ దాసులను బొగడ నేర,
నా నేరములఁ దలఁపక - దయ చేసి నన్నేలు నారాయణా. 3
ఆన యించుక లేకను - దుర్భాష లాడు నా జిహ్వ యందు,
నీ నామ చతురక్షరి - దృఢముగా నిలుప వలె నారాయణా. 4
ఒకటి పరిశుద్ధి లేక - నా జన్మ మకట! వ్యర్థం బాయెను
అకలంక మగు మార్గముం - జూపవే సకలేశ! నారాయణా. 5
వేగి లేచినది మొదలు - సంసార సాగరంబున నీఁదుచు
మీ గుణము నొక వేళను - దలఁపగదె మేలనుచు నారాయణా. 6
లోక వార్తలకు మరఁగి - కర్ణముల మీకథల విన నేరను,
ఏ కరణీ భవ జలధిఁ - దుదముట్ట నీఁదెదను నారాయణా. 7
ఇల మనుజ జన్మ మెత్తి - సుజ్ఞాన మించు కంతయు లేకను,