పుట:2015.370800.Shatakasanputamu.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలఁతఁ జెందెడు చిత్తమున్ - స్వచ్ఛంబుగాఁ జేయు నారాయణా. 8
యెంత పాపాత్ముఁడైన - మిముఁ దలంచి కృతకృత్యుఁడౌనుఁ,
బుడమి నింత పరుసము సోఁకిన - లోహంబు హేమమౌ నారాయణా. 9
కామాంధకారమునను - బెక్కు దుష్కర్మములఁ జేసి నేను,
నీ మఱుఁగు జొచ్చినాను - నామీఁద నెనెరుంచు నారాయణా. 10
సమయమైనపుడు మిమ్ముఁ -దలచుటకు శక్తి గలుగునొ కలు
గదో, సమయమని తలఁతునిపుడు -నా హృదయ కమలమున నారాయణా. 11
ఆటలన్నియు ఱంకులు -నేనాడు మాటలన్నియు బొంకులు,
పాటింప నింతకైన -నున్నదే పాపంబు నారాయణా. 12
వావి దప్పిన వాఁడను -దుష్క్రియా వర్తనుఁడ నగుదు నేను,
బావనునిగాఁ జేయవె ననుఁ బతిత పావనుఁడ నారాయణా. 13