పుట:2015.370800.Shatakasanputamu.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శా. ఏతాఁ గాక మురాంతకుండు గలఁడా యెందైన నిందైన నీ
     [1]చేఁత ల్మాను మటంచుఁ దండ్రి సుతునిన్ నిట్రాతిలోఁ జూపరా
     చూతున్ నాఁగ నృసింహరూపమున నచ్చో నుండవా చెండవా
     రాతిం బోలిన దైత్యు మేను రఘువీరా! జానకీనాయకా!104
మ. సమరక్షోణులఁ బాఱఁ బాఱఁగ జరాసంధాదులం ద్రుంచి చం
     డమదాభీలుని ధేనుకాసురుని చట్ట ల్చీరి ముష్టిప్రహా
     రములన్ ముష్టికు నా ప్రలంబదనుజున్ మ్రందించి తౌ రేవతీ
     రమణాకారముఁ దాల్చి యౌర! రఘువీరా! జానకీనాయకా!105
మ. నిను నారాయణమూర్తిగాఁ దలఁచుచున్ నీ దండ నా దండకా
     వన వాచంయము లెల్లఁ జేరి కొలువన్ వారిం గృపం జూచుటల్
     వనధిం గట్టుట రావణుం దునుముటల్ వర్ణింతు రామావతా
     ర నిరూఢాకృతి నిన్ను నౌర! రఘువీరా! జానకీనాయకా!106
మ. అమరారాతివధూటికామణులచే నశ్వత్థనారాయణ
     ద్రుమముం గౌఁగిటఁ జేర్పఁ జేసి వ్రతము ల్దూలించి బుద్ధావతా
     రమునన్ రుద్రసహాయమై త్రిపురముల్ మ్రగ్గించి తౌరౌర! ధీ
     ర! మునిస్తుత్య యశోవిహార! రఘువీరా! జానకీనాయకా!107

  1. చాఁతల్