పుట:2015.370800.Shatakasanputamu.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     యదరంటన్ రిపుఁ ద్రుంచి వేదములు దేవా దేవ! శాండిల్యనా
     రదకౌండిన్యనుత ప్రతాప! రఘువీరా! జానకీనాయకా!100
[1]మ. దనుజాధీశులు నిర్జరాధిపతులున్ దామందఱున్ మందరున్
     ఘనసత్త్వంబున నెత్తి వార్థి నహిపుం గవ్వంబుగాఁ ద్రచ్చుచో
     మునుఁగం బాఱకయుండఁ గచ్ఛపమవై మున్నీటిలోనుండు వ
     ర్తన మే నాత్మఁ దలంచుచుందు రఘువీరా! జానకీనాయకా!101
మ. ధర కల్పాంతమునన్ గరంగఁబడి పాతాళంబులో[2]నంటినన్
     దొరయం దొల్లిటియట్ల కా నిలుప నుద్యోగించి క్రోడంబవై
     పొరి నబ్భూతలమెత్తినట్టి ఘనదర్పున్ నిన్ను భావింతు ని
     ర్భరకారుణ్య నిరూఢచిత్త! రఘువీరా! జానకీనాయకా!102
మ. వడుగా! నీవడుగంగనేర విట నల్పంబైన దానంబు న
     న్నడుగన్ వచ్చితి వన్నఁ గన్గొని బలీంద్రా! నాకు నీవిచ్చు మూఁ
     డడుగు ల్మూఁడు జగంబులంచుఁ గొనవా [3]యాద్యంతముల్ మాటమా
     ర్పడ నాడన్ [4]మతికాఁడవౌర! రఘువీరా! జానకీనాయకా!103

  1. మ. అమరుల్ రాక్షసనాయకుల్ కడఁకతో నత్యంతగర్వంబునన్
         దమ సత్త్వంబుల మందరాచలముచేఁ దర్వంగ నంభోధిలో
         రమణం దద్గిరి మోచి కాచిన జగత్త్రాణుండ! కూర్మావతా
         ర మనంగా మఱి నీవెకావె రఘువీరా! జానకీనాయకా!
  2. ఁజొచ్చినన్
  3. యత్యంతమున్
  4. ముడికాఁడవౌదు