పుట:2015.333901.Kridabhimanamu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈతనికవితామాధుత్యమునకు మెచ్చి శ్రీకృష్ణదేవరాయలవా రొసంగినసమస్యయు నెకవియో చేసిన పూరణములు సుప్రఖ్యాతములు.

చ. స్తుతమతియైన యంధ్రకవి దూర్జటిపల్కుల కేల కల్గెనో
    యతులితమాధురీమహిమ; హా తెలిసెన్ జగదేకమోహనో
    ద్దతసుకుమారవరవనితాజనతాఘనతాపహరిసం
    తతమధురధరోదితసుదారసధారల గ్రోలుటంజుమీ !

   ఈ ధూర్జటిమనుమడును కృష్ణరాయవిజయ ప్రబంధ కర్తయు నగుకుమారధూర్జటికవికూడ బైసమస్యను తన గ్రంధమున బ్రశంసించుకొన్నాడు!
   సాహితీసమరాంగణసార్వభౌము డగుమహారాజు విద్వదోష్ఠిలో నట్టి సమస్యాపూర్తి జరిగినది. అది పూరించిన కవీశ్వదుడుగాని, విన్న మహారాజుగాని, అట్టివర్తనముతో నున్నయాకవీశ్వరుడుగాని దానికి నెవగించుకొనువారుగా నుందురేని యది సందర్భించునా ?
 వేయేల ? నీతివర్ననము విషయమున భూతకాలముకంటె వర్తమానకాలమే హెచ్చుగా గీర్తనీయ మని నానమ్మకము.  రాజులకు, రాజమంత్రులకు, రాజాస్థాన కవులకు వేశ్యాప్రియత్వ మొక విభవముగా సమ్మానర్హముగా బూర్వకాలమున బొగడ్త గనుచుండెడి దనుట కెన్నియేని ప్రబలప్రమాణములున్నవి.  అది దోషముగా.