పుట:2015.333901.Kridabhimanamu.pdf/3

వికీసోర్స్ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ పుట ఆమోదించబడ్డది


కృతజ్ఞతలు

ఇందు ప్రకటించిన మైలారదేవాలయద్వారమండపచిత్రముల, మాకుఁ బంపిన శ్రీ గజపతిరాయ వర్మగారికిని,

ఓరుగల్లుదుర్గపుపునాదులప్రణాళికను సర్వేపటములనుండి సేకరించుటలో మాకు సాయపడిన శ్రీ దెందులూరి సోమేశ్వరరావు ఎం. ఏ.,బి. యిడి., గారికిని,

ముద్రణ విషయమున నమూల్యములగు సలహాలనిచ్చియాధారి గ్రంధములను బరిశీలించి యాకరముల నెరుఁగుటలో మాకు మిక్కిలి తోడ్పడిన శ్రీ ఈయుణ్ణి వీరరాఘవాచార్యులుగారికిని,

శ్రమయనుకోక తంజావూరి తాళపత్ర ప్రతిని సంప్రదించి పున: పరిశీలనమున కనువుగ మాకు వలసినపాఠము లం దెట్లున్నవో జాగ్రత్తగా చూచి వ్రాసి పంపిన శ్రీ విఠల దేవుని సుందర శర్మగారికిని,

వలసినచిత్రములను దీక్షతో వ్రాసి యిచ్చిన శ్రీసుంకిరెడ్డిగారికిని,

అందముగా అచిరకాలమున అచ్చుముగించిన అజంతా ప్రింటర్సు వారికిని,

తుదికి

హార్దికముగాను, ఆర్థికముగాను మాకుఁ దోడ్పడి ప్రోత్సాహ మొసగిన మిత్రబృందమునకును ఇవే మా ప్రణామశతసహస్రములు.