పుట:2015.333901.Kridabhimanamu.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

                               మాచల్దేవి

శా. ద్వీపాంతంబున నుండి వచ్చితివె ? భూ
                      దేవా ! "ప్రశాంతం మహా
    పాపం" సర్వజగత్ప్రసిద్దనుఇమనో
              బాణాసనామ్నాయని
   ద్యోపాఖ్యాయి ప్రతాపరుద్రుధరణీ
             శోపాత్తగోష్టీప్రతి
   ష్టాపారీణ నెఱుంగ వయ్యెదవె మా
               చల్దేవివారాంగనన్  ? 180

వ. చిత్రశాలాప్రవేశంబు చేయుచున్నయది పుణ్యాహవాచన
    కాలంబు మెరును బచ్చని పెండ్లికూటంబు జూడవచ్చు
    నది యనిన 181

గీ. లెస్సగాక కిరాట ! యీ లేమచరిత
    మాడుదురు నాటకంబుగ నవనిలోన
    దీని జూడంగ బోదమా యీనెపమున
    నరసి చూతము మన కేమి యచట ? ననుచు 182

వ.అనుచు బ్రవేశనాటితకంబున జిత్రశాలజొచ్చి పూతి
   మాషగోత్రుం డచ్చోటం బెండ్లికూటంబున నిలువునం
   గైనేసి హంసతూలికాతల్పంబుమీదం గూర్చున్న హావ
   భావ విభ్రమనిలాసవిధి మాచల్దేవి గనుంగొని. 183