పుట:2015.333901.Kridabhimanamu.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీ. అంకుశసఘాతరేఖల నంద మొందు
    గంధగజకుంభములతోడ గలహమాడు
     క్రొత్తనంఅములతోడి నీ కుచభరమున
     కతివ యభ్య్హుదయపరంపరాభివృద్ది 184

గీ. కల్ల జెప్పము విను నీకు గ్ఫలప్రసిద్ధి
    డిల్లిసురతాణికిని లేదు వప్పల్లవోష్ఠి !
    యాదిలక్ష్మికి నీకును భేద మేమి
    యుదధి జనియింపకుండుట యొకటి దక్క 185

గీ. ఓరుగంటిమాచాంబ పయోరుహాక్షి
   పంచబాణావతారుని మంచి జూచి
   కంకణాలంక్రియాఝుణాత్కార మసగ
   "నయ్యగారికి జోహారు" లనుచు మ్రొక్కె 186

గీ. అగురుధూపాదివాసితాభ్యంతరంబు
    మగువ నీమన్మధచ్చత్రమంటపంబు
    సర్వయోషిదసామాన్యసౌష్టవంబు
    కాచు గావుత మోర్గంటికటకవిటుల 187

వ. అనుటయు 188

సీ. ఎందుండి వచ్చితి రీరు ? కాసల్నాట
                   నుంది వచ్చితిమి మే ముత్పలాక్షి