పుట:2015.333901.Kridabhimanamu.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జక్కులపురంద్రి

సీ. కోణాగ్రసంఘర్ష ఘుమఘుమద్వని తార
              కంఠస్వరంబుతో గారవింప
   మసిబొట్టుబోనాన నసలుకొల్పినకన్ను
             కొడుపుచే దాటించు నెడాదడప
  శ్రుతికి సుత్కర్షంబు జూపంగవలయునో
              జెవిత్రాడు బిగియించుజీవగఱ్ఱ
  గిల్కుగిల్కున మ్రోయుకింకిణీగుచ్చంబు
          తాళమానంబుతో మేలవింప
  రాగముననుండి లంఘించు రాగమునకు
 నురుమ యూరుద్వయంబుపై నొత్తిగిల్లి
 కామవల్లీమహలక్ష్మి కైటభారి
 వలపు వాడుచు వచ్చె జక్కులపురంద్రి 136

                            అక్కలు

సీ. ముద్రికామాణిక్యములదీప్తి కెంగేలి
              పించెంబుగుంచెతో బిత్తరింప
   నుపవాసమున దద్దయును సన్న నగుకౌను
             చనుదోయుభరమున జలదరింప
  దోకచుక్కల బోలుతోరంపు దెలికన్ను
             జాలైలమున సిగ్గు నతకరింప