పుట:2015.333901.Kridabhimanamu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గీ. అంబురుహనాధుదేవి కనాదిశక్తి
   కిందిరకు లోకమాతకు నిగురుబోడి
   కలరువిల్కానితల్లికి బ్రార్ధితార్ధ
   కల్పవల్లికి ంరొక్కంగ గంటి నుంటి (కాశీ. 3-4)
ఈసీసగీతిని బోలినదే క్రీడాభిరామమున నొక సీసగీతి గలదు.
గీ. నుత్యకళ్యాణి కలికుల నీలవేణి
   కస్దిశక్తికి వేదవేదాంతసార
   కేకవీరకు బూర్ణరాకేందుముఖికి
   సఖలజననికి సాష్టాంగ మమదినంబు. (క్రీడా. 137వ)
ఇట్లు ప్రతిపద్యమును బోల్చి చూపవచ్చును. ముఖ్యముగా శ్రీనాధునిరచన సర్వాంధ్రకవులరచలకంటెను శయ్యాసౌభాగ్యమున నసాధారణమై యెక్కడ బట్టిన నక్కడ స్పష్టముగా గుర్తింపదగినదై యుండును. అట్టిశయ్యాసౌభాగ్య మీ గ్రంధమున ననుపదమును గానవచ్చును శ్రీనాధుని పేరిని బట్టి యిచ్చుచున్నది. శ్రీనాధుని యితర గ్రంధములకును గ్రీడాభిరామమునకును గల రచనా సామ్యముల జూపుచున్నాడను.
శా. సారాసారమినన్ వివేకసరణిన్ సొభాగ్యభాగ్యంబులన్
    దౌరంధర్యమునన్ ప్రతాపగరిమన్ దానంబునన్ సజ్జనా