పుట:2015.333901.Kridabhimanamu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధారుం దిప్పన మంత్రివల్లభు నమాత్యగామణిం బోల్పగా
వేరీ మంత్రులు సింధువేస్టితమహోర్వీ చక్రవాళంబునన్ (క్రీడా. 31 వ)
శా. వేరీ నిన్నెదిరింపగా జగమునన్ వీరుల్ ప్రతాపోద్దతిన్
    ధౌరంధర్యమునన్ బ్రభావమహిమన్ ధైర్యంబుర- జాదలీ
    లారంభమున సాహసిక్యమున బాహాశక్తి దివ్యాయురో
    దారప్రౌడిమ దేవదైత్యనరగందర్వారిదిసంఘంబునన్ (హర.7-144)
గీ. గార్గసిద్దాంతమత ముప:కాలకలన
   శకున మూనుట యది బృహస్పతిమతంబు
   వ్యాసమతము మన:ప్రసాదాతిశయము
   విప్రజనవాక్య మరయంగ విష్ణుమతము.(క్రీడా.68 వ)
గీ. గార్గసిద్ధాంతమత ముష:కాలకలన
   శకున మూమట యది బృహస్పతిమతంబు
   విప్రజనవాక్య మరయంగ విష్ణుమతము
   సర్వసిద్ధాంత మభిజిత్తు నమ్మతమగు (భీమ.3-11)
శా. వ్రాలెన్ దిక్కుల భానుభావ్యతికర ప్రక్రీడదర్కోవల
    జ్వాలాజాల జటాలజాంగలతటీ వాచాలకోయష్టులై
    రోలంసంబులు మూతి ముట్ట వెరచెన్ గ్రొవ్వేడినీరెండలన్
    జాలంగ్రాగి కరంబువేడియగుకాసారాజ్జమైరేయముల్. (క్రీడా 153 వ)