పుట:2015.333901.Kridabhimanamu.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యలతియుద్దపుబిళ్ళ యలవోక వీక్షించు
                గొనగోర బదనిచ్చి కురులు దీర్చు
బయ్యెద దిగజార్చి పాలిండ్లు పచరించు
            దిస్సువాఱగ నవ్వు దీగనవ్వు
దవశతలపలాశతాటకంబులు త్రిప్పు
          కలికిచూపుల జూపు గర్వరేం
కటకుటీద్వార వేణుకా (వైణవ ?) కాష్ఠపీఠ
మధ్యభాగనిషణ్ణయై మదము మిగిలి
వీటి పామరవిటుల తంగేటిజున్ను
కాముబరిగొల మేదరకరణవేశ్య. 68

క. పుటభేదనబహిరంగన
    కటకశ్రీ కారకూటకటకం బగునీ
    కటకారకులవధూటీ
    కుటికాగారంబు గరడి కుసుమాస్త్రునకున్. 69

క. కీసిన వెదురుసల్లకల
   నేసిన యురుదల శిఖండి నిదుమంచమునం
   దోసరిలి కటకుటీరవి
   లాసిని రమియించు మిండలసహస్రములన్ 70

ఉ. వల్లవతకరుం దొకడు
         ప్రాక్పముపార్జితతారపం క్తితో