పుట:2015.333901.Kridabhimanamu.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృతికర్త వంశవర్ణన 3

శా. కర్ణాటక్షితినాధు డైనపెదబు
           క్కక్ష్మాసదేవేందు న
   భ్యర్ణామాత్యుని దానభేచరుని జం
          ద్రాధీశు బంధుప్రియున్
   వర్ణించున్ గవికోటి శంకరజటా
        వాటీతటాంతర్నదత్
  స్వర్ణద్యంబుతిరంగరింగణలన
         త్సాహిత్యసౌహిత్యయై. 5

క. ఆచంద్రమంత్రిమణికిని
   ఖోచాంబారత్నమునకు బుట్టెను బుధర
   క్షాచ్ణుడు మంచనార్యుడు
   వాచస్పతిస్దృశబుద్ధివైభవు డగుచున్. 6

గీ. మంచనార్యుతిప్పమకును సుపుత్రులు
    నలుపు రెన్న సింగనయును దిప్ప
    నయను మల్లనయను నయనీతిసత్కళా
    న్వితుడు చెన్నమంత్రివిభుడు ననగ. 7

గీ. సిమనామాత్యసుతుడు సుస్థిరగుణుండు
    మానినీమన్మధుడు చంద్రమంత్రివరుడు
    వెలసె వైభవముల దేవవిభుని బోలి
    సకలబుధతతి యెల్లను స్ంస్తుతింప 8