పుట:2015.333901.Kridabhimanamu.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

గాలకంధర కోదండ ఖండనునకు
గార్ముకాచార్యవర్యుండు గాధిసుతుడు. 2

స్ర. ఆ విశ్వామిత్రు గోత్రంబను జలనిధి యా
             హ్లాదముం బొందుచుండన్‌
భూవిఖ్యాత ప్రభావాభ్యుదయు డు
             దయముం బొందె నాచంద్రకీర్తుల్‌
ద్యావాపృథ్వ్యంతరాళాంతరముల
             నతి నిస్తంద్ర చంద్రాతపశ్రీ
ధావళ్య స్ఫూర్తి లక్ష్మీతరళతర కళా
             ధాళధళ్యంబు సూపన్‌. 3

శా. ఆ మంత్రీశ్వరు కూర్మినందనుడు చం
             ద్రామాత్యు డంభోజభూ
భామా రత్న పయోధరద్వయ తట
             ప్రాలంబనైపథ్య ము
క్తామాణిక్య నిభాభిరూప్యపద వా
            క్యప్రౌఢ సాహిత్య వి
ద్యా మాహాత్మ్య విలాస సమ్ముదిత వి
            ద్వన్మానసుండిద్ధరన్‌