పుట:2015.333901.Kridabhimanamu.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ములు కూడ గలవు. కాకతీయులు తొలుత బౌద్దులుగా నుండవచ్చును. వారు సాతవాహనుల యిక్ష్వాకుల చాళుక్యుల సామంతులు గావచ్చును. కాకతీయరాజ్యము ప్రధానముగా వ్యాపించిన కృష్ణాతీర మొకప్పుడు బౌద్ధ మత ప్రాచుర్యము గలది.. కనుక కాకతి గూడ దొలుత బౌద్ధదేవత యగుట సంగతమే. కాకతి, యేకవీర, మహురమ్మ, మైలారుడు, బైరవుడు కాకతీయుల యారాధ్య దైవతములు.

   కృష్ణాజిల్లాలోని ముక్త్యాలజమీందారుగాని మ్యూజియమునకై నేను సేకరించినవ్చానిలో నీ కాకతిదేవి విగ్రహమున్నది.  ముక్త్యాలకు చేరువ నున్న దొండపాడు అను గ్రామమున నేబది యెకరముల బీడునేల 'కాకతమ్మబీడు ' అను పేర గలదట! అందులో నీ కాకతమ్మవిగ్రహమున్నది.  ఆగ్రామపువా రీవిగ్రహమును కాకతమ్మ యని పేర్కొందురట.  కరణీకపులెక్కలలో నాబీడు కాకతమ్మబీడు అన్ పేరనే కలదట.  దాని విలువను గుర్తించి యావిగ్రహమును జెడకుంద నేను ముక్త్యాలకు జేర్పించితిని*. చేరునప్పటికి ముక్కు కొంత చెడినది.  దానిని జూచి నేను ఫొ"టో తీయించుకొని తెచ్చితిని.  దని ప్రతిబింబమే యిందు ప్రకటించిన చిత్రము.  అసలు రాతివిగ్రహ మిప్పుడు ముక్త్యా

  • శ్రీ గరికపాటి వేంకటేశ్వర్లుగారివలన నీ విషయమును నేను తెలిసికొని విగ్రహమును తెప్పించితిని.