పుట:2015.333901.Kridabhimanamu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పానుగంటిశాసనమున "శ్రీమతు కాకరిపురాధీశ్వర రుద్రదేవమజారాజునకు" (చూ.కాకతీయసంచిక 29 నెం. శాసనము) అని కలదు. దీనిబట్టి కాకతి గ్రామనామ మగు నని తత్పురవరాధీశ్వరులు కాకతీయు అయిరని తలపవచ్చును. కాని కాకతి గ్రామనామము గూడ కాకతిశ క్తినివాస మగుటనుబట్టి యేర్పడినది గావచ్చును. మధుర నాసిక బౌద్ధశాసనములలో కాకతేయ కాఖండి వామములు పేర్కొన బడినవి. తొలుత నాపేరు బౌద్ధుల స్త్రీ దేవత దయి యుండవచ్చును. తర్వాత నది హైందవతజెంది శివునిశక్త్ పే రయి మార్పు చెంది యుండవచ్చును. కాకండి, కాకొలను, కావలి, కావూరు మొదలగు గ్రామనామము లా శివశక్తిపేర నేర్పడినవి గావచ్చును. శక్తి మంత్రములలో 'కాది ' మంత్ర మొకటి కలదు. దానికి బంచదశి యనియు నామాంతరము. పంచదశీమంత్రద్యక్షరము 'క '. ఆ మంత్రమును గూర్చి 'కాదిమతతంత్రము ' మొదలగు గ్రంధములు మహావిద్యావిషయకములు గలవు. కాకతి యను పేరు కా+కత్తె సమాసమునుబట్టి యేర్పడినది గావచ్చును. కరిమంత్రాధిదైవతము శివుని శక్తికి మూర్తిభేదము. కాకతి దుర్గ యని ప్రతాపరుద్రీయ వ్యాఖ్యాత చెప్పుట పైవిధమున సంగతమే కాగలదు. నాసికభౌద్దగుహాసాఅసనములలో 'కాకతేయ ' 'కాబండి ' పద