పుట:2015.333901.Kridabhimanamu.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అక్కడి తిరునాళ్లలో నా వలనాటిదేశపు (ఆదేశమునకు వెలనాడనిపేరు) బాలవితంతువులదుర్వర్తనముల జుగుప్సావహవర్ణన కొంత. ఆపట్టున శ్రీకాకుళేశ్వరుని యుత్సవమునకు వచ్చినవాళ్లు 'బెరసి వెన్నెలగాయంగ నేరకమ్మపులిన తల ముల ' విహరింతురనికలదు. నేడు శ్రీకాకుళ క్షేత్రము కృష్ణామహానదిపలపలియొడ్డున నున్నది. పేరకమ్మపులివ తలములనగా కృష్ణానదీపై కతప్రదేశములా యని సందేహము తోచును. అట్లేని కృష్ణానదికే పేరకమ్మయని నామాంతరము గావలెను. అట్లేని కృష్ణానదికే పేరకమ్మయని నామాంతరము గావలెను. అట్లెడను గానరాదు. గణపతిదేవ చక్రవర్తి నాటిదగు మందరము శిలాశాసనమున (ఈగ్రామము శ్రీకాకుళపుకృష్ణ కింకను ఎగువను బెజవాడకు నెగువను కృష్ణడాపలియొడ్దున గలదు.) మందరముగ్రామము యొక్కయు, దానిలంకయొక్కయు హద్దులలో: "ఆయవ్యాం పేరకమ్మనుండి వెళ్ళిన ఇనుగాలి కాల్వతలపొలమేర" అనియు, "మందరానకున్నూ వెలంగపూండికిన్నీ వాయువ్యము పేర కమ్మనుండి వచ్చినపాయేటితలపడుమటి సీమగాను మందరపు లంక" అనియు గలదు. ఇందు కృష్ణగూడ సరిహద్దులలో వేఱుగా బేర్కొన బడినది. 'పేరకన్ము ' పదము గుండ్లకమ్మ వంటిదేమో! అది కృష్ణప్రక్కగా బాఱుచుండిన వేఱొకయేఱగునేమో! ఈ విషయ మింకను విచారింపవలసియున్నది.*


  • శ్రీకాకుళక్షేత్రమునుగూర్చి నేను 'శ్రీకాకుళ శ్రీహరి ' శతకపీఠికలో హెచ్చువిషయములు వ్రాసితిని. దాని నక్కడ చూడదగును.