పుట:2015.333848.Kavi-Kokila.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి---

పట్టుపొత్తులలోన బన్నుండగతిమాలి
   పులితోలుపై మేను మోపవలసె
సౌభోపవన కేళి జరియింపనోచక
   గిరుల గాననముల దిరుగవలెసెం<
గనకాంబరంబుల గైసేయుసిరిలేక
   మోటుకంబళిమేన మోయవలసె;
సంత:పురీ భోగ మనుభవించుటలేక
   పర్ణశాలల గష్టపడగ వలనె;

ఆకలెట్టిదొ యెఱుగక యావుపాలు
కండ చ్సక్కెఱ యుక్కఱ కమ్మనేయి
పొగయు కలమాన్నము భుజింపదగిన తనయ
కసపుకూశులనర పొట్ట మెసనవలసె;

రాజ్య సంచ్యుతుడైన ధరామహేంద్రు
 తనయ తానంచు నెఱుగదు వనకుమారి;
పలవరింపదొ చిత్తమ్ము పగులనెప్పు
డైన సత్యమ్ము తెలియగనైననయ్యొ