పుట:2015.333848.Kavi-Kokila.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

---వ న కు మా రి

అదిమధ్యాంతరహిత కాలాబ్దియందు
నిట్టిమార్పులు బుడగల యట్టు లుండు;
నిన్ని తలపోయ నా మదినున్న యూహ
పట్టులేక యభ్రమియించు బహుళగతుల.

పరులపనోడి రాజ్యూరమ. బంధులవీడి, సమస్తసౌఖ్యముల్
దొఱంగిననీ నివాసమున దు:ఖమునొందు చునేలపుత్రి సుం
దరి సుమకోమలం బ్రకృతి తత్త్వమెఱుంగని ముద్దరాలిని
త్తెఱణంగును గోనలన్ గిరుల ద్రిప్పుచునుంటి గకోర చిత్తతన్

రాజ్యభోగంబులొందు ధరాతలేంద్రు
నన్ను బరవీర భైరవు జిన్నపుచ్చి
వన నివాసంబునకు నలవాటుపఱిచె
నౌర! దుష్కాలాహిమ; యేమనగవచ్చు.

నాకయి వలవింపను బ్రే
 మాకలితార్ద్ర హృదయంగు సుమాంగి సుతం గ
 ష్టాకులమతి జేసితినని
 శోకించెద జిత్తకళిక శోషిల్లంగన్.