పుట:2015.333848.Kavi-Kokila.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి ----

ఈరతి నేండవేడిమి యొకింతశమింపగచూచి పుష్ప సం
ఘాతపరాగసమ్మిళిత ఘర్మ కణావళి బైటనొత్తుచున్
నాతిసమీర పోతచలనంబున రేగెడు చొర్ణకుంతల
వ్రాతముకన్నులం దొరగ బైకెగద్రోయుచులేచి, చెగటన్

పుప్పొడి కప్పురాలవలపుల్ చిలికించుచు గోనలోన ఱా
తిప్పల జాఱుచున్ గలకదేఱునెడన్ స్పటిక ద్రవంబు నా
నొప్పెడు చల్లనీటిమలయూట గనుగొని మున్గునిచ్చలో,
జప్పిల నప్పొలంతి మెయిచేలనదల్చి తటానదూకినన్

జలజమరందమాను నళిసంతతిజుమ్మని గేగె; తుంగ జీ
బులనిదురించుచున్ బెదరిమోమెగం, జాపుచు ఱెక్కలార్చుచున్.
వెలువడెటిట్టిభంబులటనీజల కుక్కుటముల్; తరంగసం
చలనము ముమ్మడింప జలజాతములుయ్యెలలాగె నిమ్ముగన్

    నెలత యురికిన యురవడి నీరమెగసి
    శీకరంబులు జల్లుగా జెదరిపడిన
    వర్షమనుభ్రాంతి, సంచులప్రాచి తెరల
    బెకబెక విరావములు సల్పె, భేక చయము.