పుట:2015.333848.Kavi-Kokila.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

-- వ న కు మా రి

అనుదినంబును నభ్రగంగాంబువులను
స్నానమడెదు తెఱగంటిచాన విసిగి
వన్య ఝురమున నీరాడ వచ్చెననగ
అమల జలమున జెలియమే నందగించె

ఒఱనుదూసిన కరవాలు నొఱపుదోప
వెండినాగు చొకారంబు వెల్లివిరియ
ప్రకృతి లతపూచు పువ్వన వన్య రమణి
వాగునీట దేలును సుకస్వప్నమట్లు.

జననమాదిగనీతి స్వాభావికంబున
   మీలతో బ్రతియొడ్డి లీలనీదు;
బాతుచేపను బట్టుభాతిగా దలముంచి
   యడుగు నున్ననిరాళ్ళ నంది తెచ్చు;
కమిలెనీమండంబు కడ గూఢముగ బొంచి
   నీటికోతులను వంచించినట్టు
పుక్కిళ్ళనిండుగా బూరించినీరంబు
    వారియంత్రము పోల్కి బైకిజిమ్ము