పుట:2015.333848.Kavi-Kokila.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి---

ఎదకృశియింప బ్రేమమయ మీజగమన్న తలంపసహ్యమై
 మదిబొడకట్ట; జిక్కువిడుమార్గములేని సమస్యనా వ్యధా
 ప్రదమయి లౌక్యజీవనము వ్యర్దముగా గనుపింప, నాళలన్
 వదలిన ముద్దరాలికొక భావముతో చె నతర్కితంబుగన్.

తోచినను లేచి తరుణచి తోవచించె.
 మునుపునొక గొఱ్ఱెనెత్తామ్ము మునకనుండి
 జాఱిపడినంత ముద్దయై చచ్చెనదియు;
 తనువువాయుట మనచేతి పనియెగాదె!

అనవిని రాసుతుడు నెఱగంది యిదేమి లతాంగి యత్మహ
 త్యను దలపోసి తేల? పరితాపభరంబుననిట్లు బల్కెనో,
 మనసు భ్రమించెనో, విషమమార్గమునేలవరింప? నీకు మీ
 జనకుని యానసుమ్మి కలుషంబగు దుర్మరణంబు నెంచినన్

చెలియా, యిట్టి నికృష్ట భావముల నీచిత్తంబు దూషింప కా
శలపై ద్వేషముమాని దుర్విధి తిరస్కారంబు సరించి ధీ
 బలసత్త్వంబుల లోకజీవన పయ: పాధోధి తీర్ణంబుగాన్
 గలుగున్ జన్మఫలంబునీకుం; బితనాకం బందుశాంతింగొనున్.