పుట:2015.333848.Kavi-Kokila.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

---వ న కు మా రి

బ్రతుకునందు నిదే నీకు బ్రధమదు:ఖ
 మౌట సహియింపరానిదై యలము కొనియె;
 నెలతి, కాలానుసృతిని జీర్ణించు నదియు;
 చావునాటి నిర్వేదంబు శాశ్వతంబె?

తరుణి, సుఖదు:ఖముల యాచితంబుగాగ
 సచ్చిపోవును వాసంత వర్షమట్లు;
 వనర వ్యర్దంబుగాదె యవార్యవిధికి;
 ఎవరు మృతి తప్పుకొనువారలీ జగాన?

 ప్రబలఝుంఝా మరుల్లోల భంగజలధి
 మనుజ జీవిత; మిందనమానమేల?
 తిమితిమింగలభీతి, లోదిగకయున్న
 జాలకుడు ముత్యముల నెట్లుసంతరించు?

మనము నిరువుర మేకమై మనదుమేని
 బ్రదుకు కోవలు పుప్పొడి బాటలగును;
 చాలు చాలింక దీఱని సంశయంబు!
 చెలియ, సెలయేటిస్నానంబు చేసిరమ్ము.