పుట:2015.329863.Vallabaipatel.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

వల్లభాయిపటేల్

టకును నెవరును రారయ్యె. బయటనుండి పఠానులను దింపిరి. వీరు బహు కఠినులు. వీరి విగ్రహములే యతిభయంకరములు. వీరి దర్శనమాత్రముననే రైతులు బెదరిపోవుదు రని యధికారు లాశపడిరి. పోలీసువారు లాఠీలను బ్రయోగించిరి. మిలిటరీ పటాలములు ప్రదర్శింపఁబడినవి. కాని బార్డోలీలోఁ బ్రతి బాలుఁడును నొక్కొక్క ప్రహ్లాదునివలె హరినామ సంకీర్తనము చేయుచుండెను. స్త్రీలుసహితము కంటఁదడిపెట్ట లేదు. అలనాఁడు శ్రీరామచంద్రునితో నరణ్యావాసమున కరిగిన సీతా దేవివలెఁ బ్రతి స్త్రీ తన భర్తతోపాటుగ నింటిని వదలి, గ్రామమువదలి, రాజ్యమువదలి, బరోడా బయళ్ళలోఁ చెట్లక్రిందఁ గాపురము పెట్టెను. అది వర్షకాలము. కుంభవృష్టి కురియుచుండెను. బయళ్ళన్నియు జలమయము లయ్యెను. కాని యాదీను లట్లే, తడిబట్టలతో, నానీళ్ళలో నిలఁబడియుండిరేకాని, దిగులు పడ లేదు. ఆ యాత్మశక్తి ప్రదర్శనము నిరుపమానము. ఏ యొక పుణ్యాత్ముఁడో యిట్టి త్యాగశీలమును బ్రదర్శించవచ్చును. కాని యలనాఁడు శ్రీ గోపాలుని వేణుగానమునకు మూఁగిన గోబృందములవలె కుటుంబకుటుంబములుగా, గ్రామ గ్రామములుగా, నీ జానపదు లీ త్యాగభూముల కరుగుట దైవప్రేరితముగాక మఱియేమి?

అధికారులు విస్మయచిత్తులైరి. కాని వారిహృదయములు కరగలేదు. ఇంకను గఠినతరాస్త్రములను సంధించిరి. వారి భూములను వేలము వేయసాగిరి. కాని కొనువారేరి? దీనుల యుసురు కెవరు పాత్రులుకాగలరు? బయటనుండి ధనికులను రప్పించి, పదిరూపాయల పన్నుకొఱకు పదివేలుఖరీదు